ఢీ జోడి అంటే వైల్డ్ ఫైర్ షో
on Dec 3, 2024
ఢీ జోడి సీజన్ రీసెంట్ గా లాంచ్ అయ్యింది. ఇందులో హోస్ట్ నందు పుష్ప డైలాగ్ ని యూజ్ చేస్తూ ఢీ అంటే నేషనల్ అనుకుంటివా కాదు ఇంటర్నేషనల్ అంటూ పెద్ద హైప్ ఇచ్చాడు. ఇక జడ్జెస్ గా హన్సిక, గణేష్ మాష్టర్, విజయ్ బిన్నీ మాష్టర్ వచ్చారు. ఐతే ఈ సీజన్ లో శేఖర్ మాష్టర్ కనిపించలేదు. ఆయన ప్లేస్ లో విజయ్ బిన్నీ అలరించబోతున్నారు. ఇక రావడమే విజయ్ బిన్నీ స్పేస్ తీసుకుని మాట్లాడేశారు. ఢీ షోలో జడ్జ్ చేయడం అనేది ప్రతీ కొరియోగ్రాఫర్ కి ఒక అవార్డు లాంటిది అన్నాడు. ఇక ఎప్పటిలాగే ఆది కామెడీ కోసం సిద్దమైపోయాడు..
ఢీ జోడి కాబట్టి ఆది బిగ్ బాస్ అశ్విని శ్రీ వచ్చింది. ఇక పెళ్లి బట్టల్లో సోనియా సింగ్, పవన్ వచ్చారు. ఇక ఈ షోకి అనీష్-ఆప్టి, సుబ్ - అమూల్య, లైలేష్ - అనిన్దితా, రితేష్ - ఆదిబ, సాగర్-శృతి, శశాంక్ - చైతన్య, శుభమ్-కల్పిత, సూర్య తేజ - హంస, రాహుల్ - ప్రియాన్స్ జోడీలు వచ్చి ఇరగదీసే డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశాయి. ఈసారి ఢీ జోడి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ఎండింగ్ లో నందు చెప్పిన డైలాగ్ కూడా ఫుల్ జోష్ తో ఉంది. ఇక నెటిజన్స్ ఈ ప్రోమోని చూసి ఫుల్ కిక్కిచ్చే కామెంట్స్ చేస్తున్నారు. " ఢీకి పూర్వ వైభవం వచ్చింది, ఇది కదా ఢీ అంటే ఇది. చాలా రోజుల తరువాత ఢీ చూడాలని ఉంది, ఢీ అంటే ఇలా ఉండాలి. ఎన్ని రోజులు అవుతుందో ఈ ఇలాంటి డ్యాన్స్ కోసం వెయిట్ చేసి.. ఇన్ని రోజులు ఛీ అంటే కామెడీ షో ఇప్పుడు వైల్డ్ ఫైర్ షో " అంటూ కామెంట్స్ పెడుతున్నారు.